schedule Tuesday, September 08, 2026

మహిళ మెడలో బంగారం చోరీ..!

calendar_today May 2, 2025
person dharshininews
మహిళ మెడలో బంగారం చోరీ..!
మహిళ మెడలో బంగారం చోరీ..! - 3తులాల చైన్‌ను దోచుకెళ్లిన దుండగులు - తాండూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ మహిళ మెడలో బంగారం చోరీ చేసినట్లు తెలిసింది. ఆమె మెడలో ఉన్న సుమారు 3తులాల చైన్‌ను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలో ఉంటున్న కూతురు ఇంటికి వచ్చింది. శుక్రవారం సొంత ఊరు వెళ్లేందుకని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చింది. గమనించిన గుర్తుతెలియని దుండగులు హడావుడిలో ఉన్న ఆమె మెడలో చైన్‌ను కత్తరించారు. క్షణాల్లోనే అక్కడి నుంచి జారుకున్నారు. తేరుకున్న మహిళ మెడలో చైన్ కనిపించకపోయే సరికి ఆందోళనకు గురయ్యింది. కుటుంభీకుల సాయంతో తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. పోలీసులు కూడా వెల్లడించలేదు. ఈ సంఘటన తాండూరులో కలకలం రేపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35410/