schedule Saturday, July 04, 2026

ఇంట్లోనే కొట్టి చంపారు..!

calendar_today March 19, 2025
person dharshininews
ఇంట్లోనే కొట్టి చంపారు..!
ఇంట్లోనే కొట్టి చంపారు..! - హన్మాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య - తల్లి, భార్యలే హత్యచేశారని పుకార్లు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఇంటి ఆవరణలో పడుకున్న వ్యక్తిని బలమైన ఆయుధంతో కొట్టి హత్యకు ఒడిగట్టారు. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ప్రాథమిక కథనం మేరకు బక్కని వెంకటేష్‌(33) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రించాడు. బుధవారం తెల్లవారు జామున వెంకటేష్‌ రక్తపు మడుగులో శవమై కనిపించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ నగేష్‌ పెద్దేముల్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మృతుని వెంకటేష్‌ను అతని తల్లి లక్ష్మమ్మ, భార్య సబితాలే హత్యచేసి ఉంటారని గ్రామంలో పుకార్లు వినిపించాయి. మద్యానికి బానిసైన వెంకటేష్‌ నిత్యం వేధింపులకు పాల్పడుతుండడంతో ఈ ఘాతునికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు తల్లి, భార్యలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతునికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34065/