schedule Thursday, September 10, 2026

పారిపోయిన ప్రేమ జంట..!

calendar_today July 7, 2024
person dharshininews
పారిపోయిన ప్రేమ జంట..!
పారిపోయిన ప్రేమ జంట..! - అబ్బాయి తల్లిదండ్రులకు వేధింపులు - పోలీస్టేషన్ చేరిన పంచాయతీ తాండూరు, దర్శిని ప్రతినిధి : గత కొంత కాలంగా ప్రేమించుకున్న యువజంట ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరేమో అని పారిపోయారు. విషయం తెలిసిన ఇరు కుటుంబాల్లో ఆగ్రహా జ్వాలలు నెలకొన్నాయి. అమ్మాయి ఆచూకీ చెప్పాలని వారి తరుపు కుటుంభీకులు అబ్బాయి తల్లిదండ్రులపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన తాండూరు మండలం ఓ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బాయి హైదరాబాద్ నగరంలో పెట్రోల్ పంపులో పనిచేస్తూ ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయి అదే ప్రాంతంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఇద్దరిది ఒకే ఊరు కావడంతో స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే కుటుంబాల్లో పెళ్లికి అంగీకరించరని భయపడ్డారు. గత వారం రోజుల క్రితం ఇద్దరు వారి సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. వారిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. దీంతో గ్రామంలో అబ్బాయి తల్లిదండ్రులను అమ్మాయి తరుపు కుటుంభీకులు వేధింపులకు పాల్పడ్డారని బాధితులు మీడియా ముందు వాపోయారు. అబ్బాయి, అమ్మాయి ఆచూకీ తెలపాలంటూ దాడులకు కూడా పాల్పడినట్లు ఆరోపించారు. పైగా అబ్బాయి స్నేహితులను కూడా వేధిస్తున్నారని తెలిపారు. దీంతో కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తమపై దాడులు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు 'బిడ్డా ఎక్కడున్నా ఇంటికి తిరిగి రా' అంటూ తమ అబ్బాయిని వేడుకున్నారు. ఈ సంఘటనపై ఫిర్యాదు విషయంలో పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27611/