schedule Thursday, September 10, 2026

షాక్‌ సర్క్యూట్‌కు లారీ బుగ్గి..!

calendar_today June 24, 2024
person dharshininews
షాక్‌ సర్క్యూట్‌కు లారీ బుగ్గి..!
chai jrషాక్‌ సర్క్యూట్‌కు లారీ బుగ్గి..! - యజమానికి లక్షల్లో నష్టం - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కరెంటు షాక్ సర్క్యూట్ వల్ల ఓ లారీ బుగ్గిపాలయ్యింది. ఈ సంఘటన తాండూరు పట్టణంలో ఆదిరవారం రాత్రి జరిగింది. యజమాని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరుకు చెందిన మహమ్మద్ జావిద్‌కు ఏపీ22 డబ్ల్యూ1038 నెంబర్‌తో లారీ ఉంది. లారీని ఆదివారం రాత్రి అంతారం రోడ్డు మార్గంలోని వైట్ ప్యాలెస్ సమీపంలో పార్కింగ్ చేసి ఉంచారు. సుమారు 11 గంటల ప్రాంతలో లారీకి సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభంకు అకస్మాత్తుగా సర్క్యూట్‌ వచ్చి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కాలుతున్న విద్యుత్‌ వైర్లు తెగి లారీ మీద పడ్డాయి. విద్యుత్‌ వైర్లకు ఉన్న మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. లారీలో క్యాబీన్, వెనుక భాగం పూర్తిగా బుగ్గిపాలయ్యింది. ఈ విషయం తెలుసుకున్న యజమాని జావిద్ ఆవేధన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాదం వల్ల తనకు రూ. 8నుంచి 9 లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపారు. తాండూరు ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిలు స్పందించి స్పందించి తనకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/27364/