schedule Thursday, September 10, 2026

సీనియర్‌ జర్నలిస్టు నర్సింహారెడ్డి కన్నుమూత

calendar_today May 26, 2024
person dharshininews
సీనియర్‌ జర్నలిస్టు నర్సింహారెడ్డి కన్నుమూత
సీనియర్‌ జర్నలిస్టు నర్సింహారెడ్డి కన్నుమూత - అనారోగ్యంతో విడిచిన తుదిశ్వాస  - సంతాపం ప్రకటించిన జర్నలిస్టు యూనియన్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంకు చెందిన సీనీయర్ జర్నలిస్టు నర్సింహారెడ్డి కన్నుమూశారు. పెద్దేముల్ మండలంకు చెందిన నర్సింహరెడ్డి సూర్య దినపత్రికతో పాటు మన తెలంగాణ, వెలుగు దినపత్రికలో పనిచేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. జర్నలిస్టు నర్సింహారెడ్డి మృతిపై జర్నలిస్టు యూనియన్ నాయకులు సంతాపం ప్రకటించారు. పలువురు నాయకులు, నేతలు నర్సింహారెడ్డి మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. నర్సింహారెడ్డి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26787/