schedule Thursday, September 10, 2026

మందుబాబులకు షాక్...!

calendar_today May 9, 2024
person dharshininews
మందుబాబులకు షాక్...!
మందుబాబులకు షాక్...! - ఐదు మందికి జైలు శిక్ష, జరిమాన - తాండూరు న్యాయస్థానం తీర్పు - వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మందు బాబులకు తాండూరు న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. ఐదు మంది నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం రాత్రి తాండూరు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో తాండూరు మండలం మిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన మొగులప్ప, కోటబాస్పల్లికి చెందిన రాజేష్‌, బషీరాబాద్‌ మండలం కుప్పన్‌ కోట్‌కు చెందిన రాజు, తాండూరు పట్టణానికి చెందిన భాను ప్రసాద్, ఎర్రవల్లికి చెందిన నాగరాజులు పట్టుబడ్డారు. గురువారం వారిని కోర్టులో హాజరు పరచగా సెకండ్‌ క్లాస్ జ్యూడిషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ నిందితులకు ఒక్కక్కరికి రూ. 1000ల జరిమానతో పాటు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించగా మరో 9మందికి ఒక్కొక్కరికి రూ. 1000ల జరిమాన విధించారని పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే.. జరిమానాలు, జైలు శిక్షలు తప్పవన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26316/