schedule Thursday, September 10, 2026

సంచుల్లో గంజాయి..!

calendar_today April 26, 2024
person dharshininews
సంచుల్లో గంజాయి..!
సంచుల్లో గంజాయి..! - తనిఖీలో దొరికిన ఇద్దరు యువకులు - కేసు నమోదు చేసిన పోలీసులు - వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఇద్దరు యువకులు సంచుల్లో గంజాయిని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు మండలం కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు మండలంలోని గౌతాపూర్ చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనీఖీలో అశోక్ కార్వాన్, రాజ్ కుమార్ లు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని పట్టుకుని విచారింగా వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని, వారికి కోర్టులో హాజరు పరిచి రిమాండు చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా నిర్వహిస్తున్నామని, డబ్బు, మద్యం, మత్తు పదార్థాలు తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25834/