schedule Friday, September 11, 2026

అదృశ్యమైన వృద్ధుడి మృతి

calendar_today December 9, 2023
person dharshininews
అదృశ్యమైన వృద్ధుడి మృతి
అదృశ్యమైన వృద్ధుడి మృతి - వరి పొలంలో మృతదేహంగా లభ్యం - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : మూడు రోజుల క్రితం అదృశ్యమైన వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం తాండూరు పట్టణ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన రామప్ప (60) రెండు చేతులు కోల్పోయి వికలాంగుడుగా ఉన్నాడు. అయితే కడుపు నొప్పితో బాధపడుతూ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి తాండూరుకు వచ్చాడు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆసుపత్రి నుంచి ఎవ్వరికి చెప్పకుండా రామప్ప వెళ్లిపోయాడు. శనివారం ఉదయం తాండూరు పట్టణం మల్ రెడ్డి పల్లిలోని భూకైలాస్ తాండా వైపు వెళ్లే వరి పొలాల మద్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా రామప్పగా గుర్తించారు. మృతి చెందిన రామప్పకు మతిస్థిమితం సరిగ్గాలేదని కుటుంభీకులు తెలిపారు. కుటుంభీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చె సుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22514/