schedule Friday, September 11, 2026

తాండూరులో కేటీఆర్ రోడ్‌ షో రద్దు

calendar_today November 25, 2023
person dharshininews
తాండూరులో కేటీఆర్ రోడ్‌ షో రద్దు
తాండూరులో కేటీఆర్ రోడ్‌ షో రద్దు - ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు - విషాదం నింపిన రోడ్డు ఘటన వల్ల నిర్ణయం తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తాండూరులో జరగాల్సిన మంత్రి కేటీఆర్ రోడ్ షో రద్దయ్యింది. ఈ మేరకు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఈవిషయాన్ని ప్రకటించారు. అసలేం జరిగిందంటే. నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో ఉండే గ్రామ ఓటర్లను కలిసేందుకు శనివారం తుపాన్ వాహనంలో బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ శివారులోని ఆజీజ్ నగర్ సమీపానికి రాగానే తుఫాన్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు లక్ష్మయ్య(విశ్రాంత ఉద్యోగి), రమేష్ లు అక్కడి కక్కడే మృతి చెందారు. గాయపడిన మరో 6 గురిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఈ రోడ్డు ప్రమాదంపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. ఇద్దరు నేతల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ. బలమైన నేతలను కోల్పోయని ఆవేధన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చేయడం జరిగిందన్నారు. కేటీఆర్ రోడ్ షో రద్దు బీఆర్ఎస్ పార్టీ నేతల దుర్మరణంతో పార్టీలో విషాదం నెలకొంది. నేతల మృతితో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తాండూరులో ఏర్పాటు చేసిన మంత్రి కె టీఆర్ రోడ్ షో రద్దు చేయడం జరిగిందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రకటించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22238/