schedule Friday, September 11, 2026

మార్నింగ్‌ వాక్‌లో దొరికిన ఐఫోన్‌..!

calendar_today November 20, 2023
person dharshininews
మార్నింగ్‌ వాక్‌లో దొరికిన ఐఫోన్‌..!
మార్నింగ్‌ వాక్‌లో దొరికిన ఐఫోన్‌..! - నిజాయితీగా పోలీసులకు అప్పగింత - రికవరీ చేసుకోవాలని బాధితులకు సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి: ఖరీదైన ఐ ఫోన్‌ను వినియోగదారులు పడేసుకున్నారు. దారిలో దొరికిన ఐఫోన్‌ను తీసుకుని పోలీసులకు అప్పగించి నిజాయితిని చాటుకున్నారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని వాల్మీకీనగర్‌ ఎంపీటీ హాల్‌ వెనుక భాగంలో మాజీ సర్పంచ్ కేశవరావు, రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పీఏ అంజిల్ రెడ్డిలు సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. నడుచుకుంటూ వెళుతుండగా దారిలో ఖరీదైన ఐఫోన్‌ వారికి దొరికింది. దానిని తీసుకుని పట్టణ పోలీస్టేషన్‌లో సీఐ రాజేందర్ రెడ్డికి అందజేశారు. ఫోన్‌ ను పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్టేషన్‌లో సంప్రదించాలని సీఐ రాజేందర్ రెడ్డి సూచించారు. మరోవైపు దొరికిన ఫోన్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితిని చాటుకున్న మాజీ సర్పంచ్ కేశవరావును, పీఏ అంజిల్ రెడ్డిని పలువురు అభినందించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22069/