schedule Friday, September 11, 2026

ప్లాస్టిక్‌ బాటిళ్లలో నాటుసారా..!

calendar_today October 24, 2023
person dharshininews
ప్లాస్టిక్‌ బాటిళ్లలో నాటుసారా..!
ప్లాస్టిక్‌ బాటిళ్లలో నాటుసారా..! - అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తి - విచారించి అదుపులోకి తీసుకున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్లాస్టిక్‌ బాటిళ్లలో నాటుసార కలిగి ఉన్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి బాటిళ్లను స్వాదీని చేసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలంలోని నీలిగడ్డ తండాకు చెందిన ముథావత్ రాకేష్ అనే వ్యక్తి తాండూరు మండలం ఖాంజాపూర్ గేటు వద్ద అనుమానాస్పదంగా కనింపించాడు. దీంతో పోలీసులు అతన్ని విచారించగా ప్లాస్టిక్ బాటిళ్లలో నాటునార కలిగి ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 30 లీటర్ల బాటిళ్లను స్వాదీనం చేసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21258/