schedule Tuesday, September 08, 2026

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

calendar_today September 20, 2023
person dharshininews
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం - గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి - రూ.2.50లక్షల ఎల్ ఓసీ అందజేసిన మంత్రి తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం గొల్ల చెరువు ప్రాంతానికి చెందిన బుప్రాభేగం అస్వస్థతతో అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు ప్రభుత్వం రూ.2.50లక్షలు మంజూరు చేసింది. బుధవారం హైదరాబాద్ లో మంత్రి మహేందర్ రెడ్డి బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందన్నారు. వైద్యం చేయించుకోలేని పేదలకు ఈ పథకం వరంగా మారిందన్నారు. అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, ముక్తార్ నాబ్, నాయకులు షేక్ మక్సూద్ పాష, షేక్ మన్సూర్ పాష, జహీర్ భాష తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20395/