schedule Tuesday, September 08, 2026

నాణ్యమైన మందులను అందించాలి

calendar_today September 14, 2023
person dharshininews
నాణ్యమైన మందులను అందించాలి
నాణ్యమైన మందులను అందించాలి - హయాత్ కేర్ ఫార్మసీ ఆదర్శంగా నిలవాలి - మెడికల్ షాపు ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగులకు, బాధితులకు నాణ్యమైన మందులను అందించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హయాత్ కేర్ ఫార్మసీ మెడికల్ షాపును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హయాత్ కేర్ ఫార్మసీ మెడికల్ షాపు ద్వారా వినియోగదారులకు, రోగులకు, బాధితులకు నాణ్యమైన మందులను అందించాలన్నారు. రోగుల కోసం షాపు నిర్వహకులు హోం డెలివరీ సేవలను అందించడం అభినందనీయమన్నారు. తాండూరులో కేర్ ఫార్మసీ సేవలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా షాపు నిర్వహకులు రహమతుల్లా మాట్లాడుతూ కేర్ ఫార్మసీ నుంచి వినియోగదారులకు హోం డెలివరీతో పాటు తగ్గింపు ధరలు, ఇతర సదుపాయాల సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), కాంగ్రెస్ నాయకురాలు కల్వ సుజాత, ఎంఐఎం అధ్యక్షులు హాది, మైనార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20229/