schedule Friday, September 11, 2026

టెన్షన్.. టెన్షన్‌..!

calendar_today July 22, 2023
person dharshininews
టెన్షన్.. టెన్షన్‌..!
టెన్షన్.. టెన్షన్‌..! - గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు - సంగెంకలాన్‌లో వాగు వద్దే పోలీసులు, గ్రామస్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మండలంలోని సంగెంకాలన్‌లో వ్యక్తి నిన్న రాత్రి గల్లంతయిన సంగతి తెలిసిందే. సంగెంకలాన్‌ గ్రామానికి చెందిన బొక్తంపల్లి పెంటప్ప(48) శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం షాపూర్ లో బందువుల అంత్యక్రియల కోసం సుమారు 30తో కలిసి వెళ్లారు. అంత్యక్రియలు ముగించుకుని సాయంత్రం తరువాత గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే గ్రామ సమీపంలోకి రాగానే భారీ వర్షాల కారణంగా వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. అటు వైపు, ఇటు వైపు ఉన్న గ్రామస్తులు వద్దని వారించిన పెంటప్ప వినకుండా వాగు దాటే క్రమంలో ఉదృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి చీకటి కావడంతో సక్రమంగా గాలింపు జరగలేదు. దీంతో శనివారం ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గజ ఈతగాళ్లను రప్పించి వెతుకులాట ప్రారంభించారు. కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి దగ్గరుంచి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గ్రామ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ సైతం పరిస్థితిని అక్కడే ఉండి పరిశీలీస్తున్నారు. గంటల సమయం గడిచే కోద్ది గ్రామస్తులతో ఉత్కంఠ ఏర్పడింది. పెంటప్ప ఏమైపోయాడో అని ఆందోళన పెరిగిపోయింది. వాగులో కొట్టుకుపోయిన పెంటప్పకు భార్య అమృతమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18740 chaithany collage