schedule Monday, September 07, 2026

శ్రీ‌శైలం దేవాల‌యం మూసివేత‌

calendar_today October 13, 2022
person dharshininews
శ్రీ‌శైలం దేవాల‌యం మూసివేత‌
శ్రీ‌శైలం దేవాల‌యం మూసివేత‌ - 25న ఆల‌యంలో సేవలు ర‌ద్దు ద‌ర్శిని డెస్క్ : శ్రీ‌శైలం క్షేత్రంలోని శ్రీ‌శైల భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జున స్వామి దేవాల‌యం మూత‌ప‌డ‌బోతోంది. ఈనెల 25వతేదీన సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్ర‌క‌టించారు. 25న గ్రహణం సందర్భంగా ఆలయంలో స్వామి వార్లకు ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్ల‌డించారు. అదేరోజు రాత్రి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు త‌రువాత నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు. ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని సూచించారు.