కుర్చీలతో ఫీటు.. టీచర్‌పై సస్పెన్షన్ వేటు
July 28, 2022
dharshininews
కుర్చీలతో ఫీటు.. టీచర్‌పై సస్పెన్షన్ వేటు
- వర్షపుతో నీటితో ఉపాధ్యాయురాలి కష్టాలు
- ఉత్తరప్రదేశ్ టీచర్ వీడీయో వైరల్
దర్శిని డెస్క్: వర్షపునీటి నుంచి తప్పించుకునేందుకు కుర్చీలపై ఓ టీచర్ చేసిన పీటు ఆమెకు పాట్లను తెచ్చింది. ఎంతలా అంటే ఆమె ఉద్యోగానికి ఎసరు పడింది. ఇటీవల దేశ వ్యాప్తంగా కుంభవృష్టిగా కురిసి వర్షాలు ఉత్తరప్రదేశ్‌లో కూడ పడ్డాయి. ఆ రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. కాలనీల్లోకి చేరిన వరద నీరు వందల ఇళ్లను ముంచేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల స్కూల్ పిల్లలు, సిబ్బందికి సైతం అవస్థలు తప్పటం లేదు. ఈ క్రమంలో మధుర జిల్లాలో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలు నీటిలో తడవకూడదని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉపాధ్యాయురాలు తను నీటిలో తడవకూడదని విద్యార్థులతో కూర్చీలు వేసుకుంది. ఆ తర్వాత ప్లాస్టిక్ కుర్చీలపైకి ఎక్కి వరదలో ఉన్న పాఠశాలలోకి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. స్కూల్ గేటు నుంచి పాఠశాల భవనానికి మధ్య భారీగా వర్షపు నీరు చేరి ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ నీటిలో నడిచేందుకు ఇష్టపడక అక్కడే ఉన్న విద్యార్థులను పిలిచి స్కూల్ లో ఉన్న కూర్చీలను బయటకు తెప్పించి గేటు నుంచి భవనం వరకు వేయించుకున్నారు. పిల్లల సహాయంతో కూర్చీలు ఎక్కుతూ భవనం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో మరో టీచర్ వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి చేరటంతో సదరు టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
https://twitter.com/i/status/1552544458201149442